భవానీపురంలో ఈనెల 9న చోరీకి గురైన ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకొని, నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, సీసీ కెమెరాల ఆధారంగా ఓ కంటైనర్లో ట్రాక్టర్ చోరీ అయినట్లు గుర్తించారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాజస్థాన్కు చెందిన రాజీవ్ సింగ్ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.