విజయవాడలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్ చౌక్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళనలో పాల్గొన్న సీఐ అహ్మద్ అలీ, తోపులాటలో ఒత్తిడికి గురై కుప్పకూలారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఐ అలీ మృతి పట్ల ఉన్నతాధికారులు తీవ్ర సంతాపం తెలిపారు. పోలీస్ శాఖ సమర్థుడైన అధికారిని కోల్పోయిందని హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.