గుడ్లవల్లేరు మండలంలో ప్రమాదం జరిగింది. గురువారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందగా, మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గుడ్లవల్లేరు పోలీసుల కథనం మేరకు.. విన్నకోట గ్రామానికి చెందిన చేబ్రోలు ఆదాం కుమార్తె వివాహం నిమిత్తం గ్రామస్థులు ట్రాక్టర్ లో 20 మంది నందివాడ వెళుతున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో ట్రాక్టర్ బోల్తా పడి అరుణ్ బాబు, అభిషేక్ మృతి చెందారు.