విజయవాడ: రౌడీ షీటర్లకు ఏసీపీ దామోదర్ వార్నింగ్!

విజయవాడలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, నగర పరిధిలోని రౌడీ షీటర్లకు ఆదివారం ఏసీపీ దామోదర్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రౌడీ షీటర్లు చట్టాలను గౌరవిస్తూ, సక్రమ మార్గంలో జీవనం కొనసాగించాలని ఆయన సూచించారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలని, ఎలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్