కనక దుర్గమ్మ గుడి ఘాట్ రోడ్డును శుక్రవారం ఉదయం ఆలయ సిబ్బంది మూసివేశారు. వర్షం కారణంగా ఘాట్ రోడ్డు మూసివేసినట్లు తెలిపారు. అర్జున వీధిలోని లిఫ్ట్, మెట్ల మార్గం ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని, వాహనాలు సీతమ్మవారి పాదాల సమీపంలో పార్క్ చేసుకోవాలని భక్తులకు దుర్గగుడి అధికారుల ఈ మేరకు సూచనలు జారీ చేశారు. కాగా శుక్రవారం కావడంతో ఈరోజు ఉదయం దుర్గగుడి వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది.