విజయవాడ గంజాయి మత్తులో తల్లిదండ్రులపై దాడి

విజయవాడలో ఒక యువకుడు గంజాయి మత్తులో తల్లిదండ్రులపై దాడికి పాల్పడుతున్న ఘటన చోటు చేసుకుంది. సొంత కొడుకే ఇలా దాడికి పాల్పడడం పట్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంజాయి తాగి ఇంట్లోని సామాన్లు అమ్ముకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడిపై పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని శుక్రవారం మీడియా ముందు కోరుతూ బాధితులు వీడియో విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్