మెగాస్టార్ చిరంజీవి, దివంగత హీరోయిన్ శ్రీదేవి నటించిన క్లాసిక్ మూవీ జగదేక వీరుడు- అతిలోక సుందరి మూవీ విజయవాడలోని పలు థియేటర్లలో శనివారం రీ రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటరులో ఓ యువతి సినిమాలో శ్రీదేవి ధరించిన దేవకన్య గెటప్తో వచ్చింది. దీంతో సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఆమెతో సెల్ఫీలు దిగారు. ఈ వీడియో కాస్త నెట్టెంట వైరల్ గా మారింది.