ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆడబిడ్డలపై జరిగిన రెండు ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆడబిడ్డలపై చేయి వేయాలంటే భయపడే పరిస్థితి రావాలని సీఎం అన్నారు. అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, శ్రీ సత్యసాయి జిల్లా ఏడుగురాళ్లపల్లిలో బాలికపై అత్యాచారం కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని మంగళవారం సీఎం అధికారులను ఆదేశించారు. రెండు ఘటనలపై డీజీపీ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి దర్యాప్తు అంశాలను వివరించారు.