తీర్థయాత్ర పేరుతో నరకం చూపిస్తున్న విజయవాడలోని ప్రైవేట్ బస్సులు అంటూ భక్తులు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 8వ తేది 90 మంది భక్తులు15 రోజుల యాత్రకు ఒకొక్కరు 41వేలు చెల్లించి బయలుదేరామన్నారు. కాగా నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యారని దేవరపల్లి గ్రామానికి చెందిన యాత్రికులు శ్రీకాకోళపు కాళీకృష్ణ ఆదివారం తెలిపారు.