మాదకద్రవ్య రహిత జిల్లా సాకారానికి సమన్వయ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సమష్టి కృషి అవసరమని, మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు, మత్తు పదార్థాలు వినియోగిస్తున్న వారిని గుర్తించి, సక్రమ మార్గంలో నడిపించేందుకు అన్ని విద్యాసంస్థల్లో ఈగల్ క్లబ్‌లు ఏర్పాటయ్యేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది.