ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు దోహదం చేసే సేంద్రియ ఎరువుల గుంతలపై పెద్దఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని, జిల్లాలో తొలివిడత లక్ష్యమైన 17 వేల గుంతలకు అంచనాలు రూపొందించి, వారం రోజుల్లో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు.శనివారం జి. కొండూరులో సేంద్రియ ఎరువుల గుంతల తవ్వకం కార్యక్రమాన్ని కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలిసి ప్రారంభించారు.