మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు గురువారం అవనిగడ్డలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి అంబటి రాంబాబును అంతం చేసేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడులు ఈ కుట్రలో భాగమేనని ఆయన విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదం అంశాన్ని రాజకీయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజా సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.