అవనిగడ్డ: ప్రజాస్వామ్య వ్యతిరేక పాలన సాగుతుంది

రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన సాగుతుందని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఆదివారం ఉదయం ఒక ప్రకటనలో తెలియజేశారు. గుడివాడలో జెడ్పి చైర్ పర్సన్ ఉప్పల హారిక కారు అద్దాలు పగలగొట్టడం, రాడ్లు తీసుకుని భయభ్రాంతులకు గురి చేయడం అత్యంత క్రూరమన్నారు. టిడిపి, జనసేన నాయకులు ఇలా ప్రవర్తించడం సబబు కాదని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్