అవనిగడ్డ: సరోజాదేవి మృతికి బుద్ధప్రసాద్ సంతాపం

ప్రసిద్ద సినీ నటి బి. సరోజాదేవి మరణం పట్ల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సంతాపం తెలిపారు. మంగళవారం అవనిగడ్డలో ఆయన మాట్లాడుతూ బెంగుళూరులో తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ పురస్కారాన్ని సరోజాదేవికి అందించే అవకాశం కలిగిందన్నారు. ఆమె మరణ వార్త బాధించిందన్నారు. ఆమెకు ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆమె మృతి పట్ల ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్