మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మోసగించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం రాత్రి అవనిగడ్డలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అధికారం చేపట్టిన ప్రతిసారి మోసం చేయడం అలవాటుగా మార్చుకున్నారన్నారు. దీపం పథకం కింద 30% మంది మహిళలకు మాత్రమే నగదు జమ చేశారని విమర్శించారు. ఏడాదిలో ఒక్క హామీని కూడా సరిగా నెరవేర్చలేదు అన్నారు.