అవనిగడ్డ: శరవేగంగా రెండు నూతన శ్లాబు కల్వర్టుల నిర్మాణం

ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో, మండల పరిధిలోని మోదుమూడిలో పొలిమేర కోడు డ్రైనేజీ, 1/ఏ పంట కాలువలపై రెండు నూతన శ్లాబు కల్వర్టుల నిర్మాణం శనివారం ప్రారంభమైంది. రూ. 4.82 కోట్లతో మోదుమూడి నుంచి మాచవరం, దక్షిణ చిరువోలులంక మీదుగా కొత్తపేట వరకూ 4.1 కిలోమీటర్ల నూతన రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ పనుల్లో భాగంగానే కల్వర్టుల నిర్మాణం జరుగుతోంది. ఈ పనులను పిఆర్ డీఈఈ మోజెస్, ఏఈఈ భరద్వాజ పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్