నియోజకవర్గంలో చేపట్టిన డ్రైనేజీల పనులు సమర్ధవంతంగా చేయాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సూచించారు. బుధవారం అవనిగడ్డలోని తమ కార్యాలయంలో డ్రైనేజీ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లింగన్నకోడు కిక్కిస తొలగింపు, గుండేరు పూడికతీత పనులు జరుగుతున్న తీరు అధికారులు వివరించారు. కృష్ణాపురం - నరసింహాపురం కిక్కిస తొలగింపు పనులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఎమ్మెల్యే సూచించారు.