కృష్ణ నదిలో ప్రవహిస్తున్న వరద నీటితో అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామస్తుల రాకపోకలు సాగించే కాజ్వే గట్టు శుక్రవారం ఉదయం మరోసారి గండి పడింది. గ్రామస్తులు రాకపోకలకు పడవ ఏర్పాటు చేసి ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, రాజకీయ నాయకులు ఎడ్లంక గ్రామానికి క్యూ కట్టనున్నారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పడవను ఏర్పాటు చేశారు.