అవనిగడ్డ, బుధవారం సాయంత్రం: నియోజకవర్గంలోని బీసీ వసతి గృహాల టెన్త్ టాపర్లకు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని, చదువే సర్వస్వంగా భావించి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.