అవనిగడ్డ: చీపురు పట్టిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

గ్రామంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను స్వచ్ఛంగా మార్చాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం అవనిగడ్డలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా చీపురు పట్టి చెత్తను ఊడ్చి తొలగించారు. పంచాయతీ పారిశుధ్య సిబ్బంది పిచ్చి మొక్కలు, చెత్త చెదారం తొలగించారు. ఆవరణలో కంపలో మరుగున పడి ఉన్న శ్రీకృష్ణ మందిరాన్ని ఎమ్మెల్యే గమనించి పిచ్చి మొక్కలు తొలగించారు.

సంబంధిత పోస్ట్