మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం 'జనసేన - జనవాణి' కార్యక్రమం జరిగింది. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించి, వాటిని పరిశీలించి, సంబంధిత శాఖల ద్వారా పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.