అవనిగడ్డ గ్రామ దేవత లంకమ్మ అమ్మవారికి మూడవ వార్డు ప్రజలు భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. శుక్రవారం ఉదయం మేళ తాళాలతో ఆలయానికి చేరుకొని పోతరాజు, గుడి చుట్టూ ప్రదర్శనలు చేశారు. అనంతరం అమ్మవారికి మహిళలు అందరూ అమ్మవారికి పసుపు కుంకుమ, అరిసెలు, బూరెలు, గారెలు, కజ్జికాయలు, కేసరి, పూర్ణాలు, రవ్వ ఉండలు, చలిమిడి వడపప్పులతోపాటు పలు రకాల స్వీట్లు టెంకాయలు సమర్పించారు.