అవనిగడ్డ: పిల్లల నడవడికపై దృష్టి సారించండి

పిల్లల నడవడికపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం అవనిగడ్డ జడ్పీ హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి పిల్లల చదువు వారి ఆలోచనల గురించి ఉపాధ్యాయులు తెలియజేయడం మంచి విషయం అన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్