అవనిగడ్డ ప్రాంతం నుంచి అక్రమంగా 1500 కిలోల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న నలుగురు వ్యక్తులను గురువారం అవనిగడ్డ పోలీసులు పట్టుకున్నారు. పెద్దకళ్ళేపల్లి గ్రామానికి చెందిన పడమటి సాయికిరణ్ అనే వ్యక్తి తన వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో 40 మూటల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ దాడిలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.