అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విద్యార్థులను సంస్కృతికి వారసులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. శనివారం అవనిగడ్డలోని ఎస్. వి. ఎల్ క్రాంతి కళాశాలలో విద్యాసంస్థ చైర్మన్ దుట్టా ఉమామహేశ్వరరావు సహకారంతో 99టీవీ ఛానల్ ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్ గరికపాటి సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ భోగిమంట వెలిగించి, బాల బాలికలకు భోగి పళ్ళు పోశారు.