అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం అరకు కాఫీని ప్రోత్సహిస్తోందని తెలిపారు. బుధవారం అవనిగడ్డలో డ్వాక్రా మహిళ కంచర్ల ప్రభుకుమారి, టీడీపీ నేత కంచర్ల ఆనంద్ దంపతులు నూతనంగా ఏర్పాటు చేసిన అరకు కాఫీ షాపును ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు ముఖ్య అతిధులుగా విచ్చేసి ప్రారంభించి, శుభాశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు.