అవనిగడ్డ: సాంకేతిక విద్యారంగంలో నిపుణులుగా ఎదగాలి

విద్యార్థులు సాంకేతిక విద్యారంగంలో నిపుణులుగా ఎదగాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం చల్లపల్లిలోని విజయ క్రాంతి జూనియర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ప్రసంగిస్తూ ఇంటర్ విద్యార్థులు ప్రతిభతో పాటు కమ్యూనికేషన్స్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్