ఘంటసాల: నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

ఇళ్ల పరిసరాలలో ఉన్న తొట్లలో, టైర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని జిల్లా మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ పిఎస్. రాజు పేర్కొన్నారు. సోమవారం ఘంటసాల మండల పరిధిలోని పాపవినాశనం గ్రామంలో పలుచోట్ల నిల్వ ఉన్న నీటిని తొలగింపజేసి ప్రజలకు ఆయన అవగాహన కల్పించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దోమల వ్యాప్తి నిర్మూలనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అన్వర్ షరీఫ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్