ఘంటసాల గ్రామంలోని సత్రం సెంటర్లో గల రజకుల శ్రీరామాలయం నందు సీతమ్మవారికి ఆషాడం మాస సారెతోపాటు అమ్మవారికి పసుపు, కుంకుమలు సమర్పించారు. సీతారాముల వారి విగ్రహ దాతలు పి. శ్రీనివాసరావు - రజిని దంపతులచే స్వామివారికి పూజలు శనివారం చేయించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు. పురోహితులు ప్రసాద్ ఆధ్వర్యంలో పూజ కార్యక్రమం జరిగింది.