చల్లపల్లికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల వెంకటేశ్వరరావు తల్లి తుమ్మల లలితమ్మ (102) బుధవారం రాత్రి కన్నుమూశారు. గత వారం రోజులుగా స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న ఆమె భౌతిక కాయాన్ని చల్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి సెంటర్లోని వారి స్వగృహంలో సందర్శనార్థం ఉంచారు. గురువారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.