డిజిటల్ అరెస్ట్, ఫేక్ ఇన్వెస్ట్మెంట్ యాప్స్, తక్కువ వడ్డీతో రుణాలు వంటి నకిలీ ఆకర్షణల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ ఈశ్వరరావు సూచించారు. బుధవారం రాత్రి చల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సీనియర్ సిటిజన్లకు సైబర్ మోసాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నకిలీ కేసుల పేరుతో మోసగాళ్లు భయపెట్టే ప్రయత్నాలు చేస్తారని, అలాంటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు.