వేసవి ఎండలు మండుతున్న సమయంలో, మంగళవారం సాయంత్రం ఆకాశం మేఘావృతం కావడంతో మొక్కజొన్న రైతుల్లో ఆందోళన నెలకొంది. చల్లపల్లి మండలంలో మొక్కజొన్న కండివిరిచి, హార్వెస్టింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. యంత్రాలతో హార్వెస్టింగ్ పూర్తయిన తర్వాత పొలాల్లో ఆరబెట్టిన మొక్కజొన్నకు వాతావరణ మార్పులు ఆటంకం కలిగిస్తాయని రైతులు భయపడుతున్నారు.