చల్లపల్లి: చీరకు నిప్పు అంటుకొని వృద్ధురాలి మృతి

చల్లపల్లి మండలం పురిటిగడ్డ గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తూ చీరకు నిప్పు అంటుకొని విమలకుమారి (80) అనే వృద్ధురాలు మృతి చెందారు. ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఆమె టీ తయారు చేసుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది. స్థానికులు వెంటనే ఆమెను విజయవాడ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.

సంబంధిత పోస్ట్