చల్లపల్లి మండలం యార్లగడ్డలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఏరువాక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ జోడెడ్లకు పూజలు చేసి, పొలం దున్ని వ్యవసాయ పనులను ప్రారంభించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల ఇంట ధాన్యం నిండాలని, ప్రభుత్వం అండదండలతో అన్నదాతలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.