గురుపౌర్ణమి వేడుకలను చల్లపల్లి మండలంలోని పాగోలు ఎన్టీఆర్ స్కూల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలో ఉన్న గౌతమ బుద్ధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువులు సత్కరించాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థిపై ఉందని ఉపాధ్యాయులు సూచించారు. మంచి నడవడికతో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని సూచించారు.