చల్లపల్లిలో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రజలకు ఉపశమనం కలిగించినా, రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలుల కారణంగా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.