ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఇటీవల సంభవించిన మోందా తుఫాన్ కారణంగా దివి ఏరియాలో దెబ్బతిన్న పంటలను గురువారం రైతులతో కలిసి పరిశీలించారు. చల్లపల్లి మండలంలోని రాముడు పాలెం గ్రామంలో విరిగిన అరటి తోటను పరిశీలించి, ఆపదకాలంలో రైతులకు అండగా నిలవాలని, నష్టపోయిన వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.