అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని తెలిపారు. శుక్రవారం ఘంటసాల గ్రామంలోని వైద్యశాల వద్ద ఏర్పాటుచేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించి, మూగజీవాలు వ్యాధుల బారిన పడకుండా నివారించడంలో పశువైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.