ఘంటసాల: మబ్బులతో రైతులు ఆందోళన

ఘంటసాల మండలంలో తుఫాన్ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం ఉదయం మబ్బులు రావటంతో వరి పంట వేసిన రైతులు భయపడుతున్నారు. యంత్రాలతో వరి కోసిన రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తేమ శాతం అధికంగా ఉండటంతో మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. మండలంలో పలుచోట్ల మబ్బులతో కూడిన ఈదురు గాలులు వీచడంతో చలి తీవ్రత కనిపిస్తుంది.

సంబంధిత పోస్ట్