ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం గ్రామం వద్ద ఉన్న కృష్ణానదిలో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు మూడు లక్షల మేర నీటిని విడుదల చేయడంతో పుష్కర ఘాటు వద్ద వరకు వరద నీరు చేరుకుంది. జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ గీతాంజలి శర్మ ఆదేశాల మేరకు తహశీల్దార్ రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం, పాపవినాశనం గ్రామాల ప్రజలకు రెవెన్యూ సిబ్బంది సూచనలు చేశారు.