ఘంటసాల: భారీగా చేరిన వరద నీరు

ప్రకాశం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీరు కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఘంటసాల మండల పరిధిలోని శ్రీకాకుళం వద్ద ఉన్న కృష్ణా నదికి గురువారం ఉదయం భారీగా వరద నీరు చేరింది. ఘంటసాల తహసీల్దార్ విజయప్రసాద్ రెవెన్యూ సిబ్బందిని అప్రమత్తం చేసి, నదిలోకి పశువుల, మేకల కాపరులు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. నదీ పరివాహక ప్రాంతాలైన శ్రీకాకుళం, పాపవినాశనం గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు.

సంబంధిత పోస్ట్