ఘంటసాల: 'కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి'

కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం ఘంటసాల మండల పరిధిలోని తాడేపల్లి గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేయడంతోపాటు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్