ఘంటసాల: కోడిపందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్ఐ

సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, జూదక్రీడలు వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఘంటసాల ఎస్ఐ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని లంకపల్లిలో గతంలో కోడిపందాలు జరిగిన ప్రాంతాల్లో హెచ్చరిక బ్యానర్లు ఏర్పాటు చేశారు. కోడిపందాలు, గుండాట, పేకాట, జూదం, అశ్లీల నృత్యాలు వంటి కార్యకలాపాలు నిషేధించబడ్డాయని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్