ఘంటసాల - రామానగరం మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలైన సంఘటన శనివారం ఉదయం జరిగింది. చల్లపల్లి నుంచి ఘంటసాల వస్తున్న కారును పుచ్చగడ్డ దాటిన తర్వాత యువకులు ఇద్దరు ప్రయాణిస్తున్న బైక్ ఢీకొట్టడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసం అయింది. బైక్ కూడా ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో భార్యాభర్తలతోపాటు కుమారుడు ఉండగా, చిన్నారికి గాయాలయ్యాయి.