ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని కృష్ణా నదిలో స్నానానికి వెళ్ళి యువకుడు గల్లంతు అయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన ఫణి కుమార్ కృష్ణా నది వద్ద స్నేహితులతో కలిసి స్నానానికి వెళ్ళి ప్రమాదవశాత్తు కాలు జారి పడి గల్లంతు అయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన స్నేహితులు స్థానికులకు సమాచారం అందించడంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు ఆచూకీ లభ్యం కాలేదు.