ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న కోడూరు గ్రామానికి చెందిన బండారు మణికంఠను టిఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ తిరుపతి శ్రీనివాసరావు గురువారం పరామర్శించారు. విజయవాడలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న మణికంఠను పరామర్శించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్య ఖర్చుల నిమిత్తం తిరుపతి శ్రీనివాసరావు రూ. 20 వేల రూపాయల నగదును మణికంఠకు అందజేశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.