కోడూరు: కానిస్టేబుల్ పై దాడి చేసిన వారిపై కేసు నమోదు

కోడూరు మండలం విశ్వనాథపల్లిలో అద్దంకి నాంచారమ్మ తల్లి జాతరలో సోమవారం అర్ధరాత్రి కానిస్టేబుల్‌పై దాడి జరిగిన సంఘటనపై కోడూరు ఎస్సై చాణిక్య కేసు నమోదు చేశారు. పిట్టలంక గ్రామానికి చెందిన కోట మహేష్, కోట నరేష్ అనే ఇద్దరు యువకులు, డిజె సౌండ్ తగ్గించమని చెప్పిన కానిస్టేబుల్ పి వేణు స్వామిపై దాడి చేశారని తెలిపారు. వేణు స్వామి ఫిర్యాదు మేరకు ఇరువురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై మంగళవారం వెల్లడించారు.

సంబంధిత పోస్ట్