కోడూరు మండల పరిధిలోని మందపాకల గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు మత్తి జానకమ్మ(102) మృతి చెందారు. జానకమ్మ 102 సంవత్సరాల పాటు ఆరోగ్యవంతంగా ఆమె పనులు ఆమె చేసుకుంటూ జీవిస్తూ అనారోగ్యంతో మృతి చెందినట్లు వారి కుంటుంబ సభ్యులు ఆదివారం తెలిపారు. మృతదేహాన్ని పలువురు బంధువులు గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు.