దమ్ము ట్రాక్టర్ల వీల్స్ కు ఇనుప పట్టాలు లేకుండా రోడ్డు మీద నడవడం అపరాదమని కోడూరు ఎస్సై చాణిక్య అన్నారు. గురువారం సాయంత్రం కోడూరు మండల పరిధిలోని వి. కొత్తపాలెం గ్రామం వద్ద రైతులకు ట్రాక్టర్ యజమానులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కోడూరు - అవనిగడ్డ ప్రధాన రహదారితో పాటు పలు రహదారుల మీద దమ్ము ట్రాక్టర్లు పట్టాలు లేకుండా తిరగడం వల్ల రహదారులు పాడైపోతున్నాయని తెలిపారు.