కోడూరు: కోతకి గురైన కరకట్ట.. పొంచి ఉన్న ప్రమాదం

కృష్ణా నది కరకట్ట కోడూరు మండలం ఉల్లిపాలెం సమీపంలో పలు చోట్ల కోతకి గురైంది. ప్రస్తుతం కృష్ణా నదికి వరద వస్తున్న నేపథ్యంలో ప్రమాదం పొంచి ఉందని నదీ పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరకు నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కరకట్టకు ముప్పు పొంచి ఉన్నందున చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్